Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌ ను వరదలు వణికిస్తున్నాయి. దేశం మొత్తంలో ఏదో ఒక సమయంలో వరదలు వస్తూనే ఉంటాయి. దేశంలో ఒక్కోసారి ఒక్కో చోట లేదా ఒక్కో రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాలు అంటూ మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. కానీ గత కొన్న నెలలుగా హిమాచల్‌ ప్రదేశ్ వరదలు, వర్షాల గురించి రెగ్యులర్‌ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నమోదు అయ్యే వర్షపాతంకు సమానంగా కేవలం హిమాచల్‌ ప్రదేశ్‌ లోనే నమోదు అవుతుందా అన్నట్లుగా భారీ వర్షాలు అక్కడ పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ వర్షాల కారణంగా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. కోలుకునే సమయం కూడా ఇవ్వకుండా వరుసగా కుంభవృష్ఠి వర్షపాతం నమోదు అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్‌ ను భారత వాతావరణ కేంద్రం జారీ చేయడం జరిగింది. కోల్‌దామ్ రిజర్వాయర్ పొంగి పొర్లుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరి కోల్‌దామ్‌ రిజర్వాయర్‌ లో 10 మంది చిక్కుకున్నారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వారు సురక్షితంగా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం అధికారుల వద్ద లేదు. ఈ సమయంలోనే వాతావరణ శాఖ చేసిన ప్రకటన స్థానికులకు వణుకు పుట్టిస్తోంది. ఈనెల 22 నుంచి 24వ తారీకు వరకు అంటే రేపటి నుండి మూడు రోజుల పాటు భారీగా వర్షపాతం నమోదు అవ్వబోతుందట. ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టాల్సిన అవరం ఉంది. మూడు రోజుల పాటు వర్షాలు భారీ ఎత్తున కురిసే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఈ ఏడాది కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో మరెన్ని మరణ వార్తలు వినాల్సి వస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.


Also Read: BRS First List: తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్, ఆ 8 మందికి షాక్, మజ్లిస్ స్థానాల్లో అభ్యర్ధుల ప్రకటన 


కోల్‌దామ్‌ రిజర్వాయర్‌ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను పెద్ద ఎత్తున అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు మరియు స్థానిక రెవిన్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌ అరిందమ్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి మట్టం భారీగా పెరగడం వల్ల బోటులో వెళ్లలేని పరిస్థితి. అంతే కాకుండా అత్యంత ప్రమాదకరంగా రిజర్వాయర్‌ పరిస్థితి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోటలకు పైగా నష్టం వాటిల్లింది. రాబోయే మూడు రోజుల వర్షాలతో మరింతగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో వర్షాల కారణంగా 224 మంది చనిపోయినట్లుగా అధికారిక లెక్కలు తేల్చాయి. ఇక వర్షాల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి మరో 118 మంది మృతి చెందారని కూడా అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ వర్షాలు, వరదలు ఇంకా ఎన్నాళ్లు అంటూ హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి